News18th Dec 11:48 AMSunil Byrisetty1 min read
కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు
ఆధునికంగా ఎంత ముందుకు సాగుతున్న నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ, కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాలని పద్మవిభూషణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు
ఆధునికంగా ఎంత ముందుకు సాగుతున్న నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ, కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాలని పద్మవిభూషణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుడివాడ సత్యనారాయణపురంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య మెగా శిబిరంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కైకలూరు గుడివాడ ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ,నాట్స్, ఐఎంఏ ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వల చేసి సభా కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బాల్య దశలో తన జీవన శెలిని సభ ముఖంగా వెంకయ్య నాయుడు వివరించారు. జై ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి గుడివాడ అంటే తనకు ఇష్టమని, విద్యార్ది ఉద్యమంలో ఎక్కువగా గుడివాడ వచ్చాననీ ఆయన అన్నారు.