National26th Nov 01:47 PMSunil Byrisetty1 min read

క్యూఆర్‌తో కొత్త ఆధార్ కార్డు.. నో డిటెయిల్స్

ఆధార్ కార్ దుర్వినియోగానికి చెక్ పెట్టేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక సంస్కరణ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంద

క్యూఆర్‌తో కొత్త ఆధార్ కార్డు.. నో డిటెయిల్స్
ఆధార్ కార్ దుర్వినియోగానికి చెక్ పెట్టేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక సంస్కరణ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డులో ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు కార్డు మీద కనిపించే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముద్రిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించనున్నారు. ఈ కొత్త కార్డులో ఉండే ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ద్వారానే అవసరమైన సమాచారం ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. దీనిని కేవలం అధికారిక పద్ధతుల ద్వారా మాత్రమే స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దీనివల్ల హోటళ్ళు, కార్యాలయాలు, ఈవెంట్‌లలో ఆధార్ కార్డు ఫొటోకాపీలు తీసుకొనే వారు దుర్వినియోగం చేకుండా రక్షణగా మారనుంది. అలాగే వ్యక్తిగత వివరాలకు గోప్యత పెరగనుంది.
Aadhaar
UIDAI
New Aadhaar Card
QR Code
Data Privacy
Identity Security
India
Personal Data Protection
Aadhaar Reform
Encrypted QR Code
Misuse Prevention
Digital Verification
Scroll for the next article