News30th Jan 11:25 AMSunil Byrisetty1 min read
తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం
తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్
తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిచ్చారు. ఈ నెలలోనే ఏపీ ప్రభుత్వం నుంచి ఈ అభ్యర్థన అందిందని, విమానాశ్రయానికి అవసరమైన స్థల వివరాలను కూడా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అందజేసిందని ఆయన వివరించారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని మరో మూడు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక అధ్యయనాలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలులో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఏఏఐ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసిందన్నారు.