Telangana14th Nov 01:41 PMSunil Byrisetty1 min read

కొత్తగూడెంలో కొత్త ఎయిర్ పోర్టు!

తెలంగాణలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు కానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని సుజాతనగర్‌ వద్ద సుమారు 66

కొత్తగూడెంలో కొత్త ఎయిర్ పోర్టు!
తెలంగాణలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు కానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని సుజాతనగర్‌ వద్ద సుమారు 667 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ఏళ్లనాటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకు అధికారులు ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించారు. పెనగడప, పాల్వంచ–దమ్మపేట, చాపరాలపల్లి, దుమ్ముగూడెం, సుజాతనగర్‌, సీతంపేట ప్రాంతాలను పరిశీలించారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సుజాతనగర్‌ ప్రాంతం విమానాశ్రయ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Scroll for the next article