News8th Jun 07:49 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వం ఇచ్చే వేతనం.. ప్రజల కోసమే!
విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా గొంప కృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సంఘ సేవలను విస్తృతం చేసి, బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని గొంప కృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి లభిం
విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా గొంప కృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సంఘ సేవలను విస్తృతం చేసి, బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని గొంప కృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి లభించే గౌరవ వేతనం, అలవెన్స్‌లు తీసుకోకుండా, ఆ డబ్బును డీసీఎంఎస్ బలోపేతానికి వినియోగిస్తానని ప్రకటించారు. పదవిని అందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అభినందించారు.