News30th Aug 04:47 PMSunil Byrisetty1 min read
మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర
మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు ప్రవహిస్తాయని పేర్కొన్న
మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు ప్రవహిస్తాయని పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని పేర్కొన్నారు.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం భావోద్వేగానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వ్యాఖ్యానించారు. రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం అంటూ పిలుపునిచ్చారు.