Health21st Jul 11:39 AMSunil Byrisetty1 min read

డెంగీ నివారణకు కొత్త టీకా

డెంగీ వైరస్ ను నివారించేందుకు కొత్త టీకా ఆవిష్కరణ జరిగింది. 'డెంగీ' మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. జపాన్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా 'క్యుడెంగా' వ్యాక్సిన్‌ ను అ

డెంగీ నివారణకు కొత్త టీకా
డెంగీ వైరస్ ను నివారించేందుకు కొత్త టీకా ఆవిష్కరణ జరిగింది. 'డెంగీ' మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. జపాన్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా 'క్యుడెంగా' వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేసింది. ఆ వ్యాక్సిన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతినిచ్చింది. ఈ టీకాను నాలుగేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకు తీసుకోవచ్చు. గతంలో డెంగీ వ్యాధి బారిన పడిన వారు సైతం, ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో దాన్నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందొచ్చు. ముందస్తు పరీక్షలు కూడా అవసరం లేదు. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 43 దేశాలు వినియోగిస్తున్నాయి.
India
Health
Dengue
Dengue Vaccine
Qdenga
Takeda
DCGI
Public Health
Healthcare
Vaccination
వైద్య వార్తలు
డెంగీ నివారణ
హెల్త్ న్యూస్
బ్రేకింగ్ న్యూస్
Scroll for the next article