News6th Nov 05:21 PMSunil Byrisetty1 min read
‘ఆప్కో’లోని స్టాక్ తో నూతన డిజైన్లు
చేనేత వస్త్రాల స్టాక్ తో కొత్త డిజైన్లతో చిన్న పిల్లల ఫ్రాగ్ లు, రెడీమేడ్ చీరలు, పంచెలు క్యారీ బ్యాగ్ లు తయారు చేసి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి
చేనేత వస్త్రాల స్టాక్ తో కొత్త డిజైన్లతో చిన్న పిల్లల ఫ్రాగ్ లు, రెడీమేడ్ చీరలు, పంచెలు క్యారీ బ్యాగ్ లు తయారు చేసి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. మంగళగిరలోని యర్రబాలెం ఆప్కో గోడౌన్ ను ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాతో కలిసి పరిశీలించారు. గోడౌన్ లో ఉన్న స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ.15 కోట్ల విలువైన వస్త్రాలు గోడౌన్ లో ఉన్నట్లు ఆప్కో మేనేజర్ మనోజ్ కుమార్ తెలిపారు. 96 ఆప్కో షో రూమ్ లకు గానూ 93 షో రూమ్ ల నుంచి రూ.13.48 కోట్లకుపై గా స్టాక్ వెనక్కి తెప్పించామని మిగిలిన మూడు షో రూమ్ ల నుంచి త్వరలోనే స్టాక్ రానుందని ఆయన తెలిపారు. గోడౌన్ లో ఉన్న రూ.కోటీ 60 లక్షల మేర స్టాక్ తో కలిపి రూ.15 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు ఉన్నాయన్నారు. స్టాక్ వస్త్రాలను పరిశీలించిన మంత్రి సవిత... ఆ దుస్తులను గ్రేడింగ్ గా విభజించి, డ్యామేజీ కాని వస్త్రాలను రీ సేల్ కు పంపాలని ఆదేశించారు. అవసరమైతే, సబ్సిడీ ధరలపై విక్రయించాలని స్పష్టంచేశారు. ఈ స్టాక్ తో ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ దుస్తులు, క్యారీ బ్యాగ్ లు తయారు చేస్తున్నామన్నారు.