News30th Sep 11:01 AMSunil Byrisetty1 min read
మంత్రి భరత్ కృషితో మచిలీపట్నం- కర్నూలు రైలు
కర్నూలు నుంచి మచిలీపట్నం కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. కర్నూలు–విజయవాడ మధ్య కొత్త రైలు ఏర్పాటు చేయాలని మంత్రి టీజీ భరత్ చేసిన విజ్ఞప్తికి స్పందించ
కర్నూలు నుంచి మచిలీపట్నం కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. కర్నూలు–విజయవాడ మధ్య కొత్త రైలు ఏర్పాటు చేయాలని మంత్రి టీజీ భరత్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని సెప్టెంబరు 28న లేఖ ద్వారా తెలిపారు. మచిలీపట్నం–కర్నూలు సిటీ మధ్య విజయవాడ మీదుగా ఈ రైలు వారానికి మూడు రోజుల చొప్పున ఇరువైపులా రాకపోకలు సాగించనుంది. మచిలీపట్నం నుంచి సోమవారం, బుధవారం, శనివారం సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మంగళవారం, గురువారం, ఆదివారం ఉదయం 9.30 గంటలకు కర్నూలు సిటీ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9.35 గంటలకు మచిలీపట్నం చేరుతుంది. మొత్తం 499 కిలోమీటర్ల మార్గంలో గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో హాల్ట్ లు ఉంటాయి.