News26th Mar 04:42 PMSunil Byrisetty1 min read
ట్రూకాలర్ యాప్ లేకున్నా.. ఎవరో తెలిసిపోతుంది!
ఏదైనా తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే ఏం చేస్తాం.. ట్రూకాలర్లో చూస్తాం అంటారా? ఇకపై ఆ అవసరం లేదు. ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేసేయొచ్చంట. మరి ఆ నంబర్లు ఎవర
ఏదైనా తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే ఏం చేస్తాం.. ట్రూకాలర్లో చూస్తాం అంటారా? ఇకపై ఆ అవసరం లేదు.
ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేసేయొచ్చంట. మరి ఆ నంబర్లు ఎవరివో ఎలా తెలుస్తాయనే సందేహం వస్తోందా? కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ దీనికి పరిష్కారాన్ని తెస్తోంది. భారతదేశ మొబైల్ యూజర్లకు త్వరలో ఓ కొత్త ఫీచర్ రాబోతోంది.
మనకు ఫోన్చేసే వ్యక్తుల నేమ్ కోసం ఇప్పటివరకు ట్రూకాలర్ వంటి యాప్స్ వినియోగించాం.
జియో, ఎయిర్టెల్, VI టెల్కమ్ సంస్థలు ఇకనుంచి అటువంటి ఫీచర్ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించాయి.
కాలర్ నేమ్ ప్రెసెంటేషన్ (CNAP) అనే కొత్త ఫీచర్ లేదా యాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు
తెలిపాయి. కాబట్టి సిమ్ తీసుకున్న వినియోగదారులు ఇచ్చే పేర్లే ఈ ఫీచర్ ద్వారా కాల్ రిసీవ్ చేసుకునే వారికి కనిపిస్తాయన్న మాట.