News9th May 05:51 PMSunil Byrisetty1 min read
ఆంధ్రా టు అబుదాబి.. కొత్త విమాన సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ర
ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు.
రాష్ట్రమంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం- అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
వారానికి నాలుగు రోజులు ఈ సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు.
ఇక జూన్ 12 నుంచి విశాఖ- భువనేశ్వర్ విమాన సర్వీసు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
విజయవాడ - బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.