Crime30th Aug 10:52 AMSunil Byrisetty1 min read

స్క్రీన్ షేరింగ్‌తో సరికొత్త మోసాలు

టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఏ ఫీచర్‌నూ వదలకుండా దోచేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌లో 'స్క్రీన్ షేరింగ్' ఫీచర్‌తో బ్యాంకు ఖాతాలన

స్క్రీన్ షేరింగ్‌తో సరికొత్త మోసాలు
టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఏ ఫీచర్‌నూ వదలకుండా దోచేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌లో 'స్క్రీన్ షేరింగ్' ఫీచర్‌తో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలంగాణ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ప్రముఖ కంపెనీల కస్టమర్ కేర్ లేదా బ్యాంకు ఉద్యోగులుగా సైబర్ మోసగాళ్లు పరిచయం చేసుకుంటారు. మన ఖాతాలో సమస్య ఉందని వాట్సాప్‌లో స్క్రీన్ షేర్ చేయాలని కోరతారు. పొరపాటున స్క్రీన్ షేర్ చేస్తే ఫోన్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లినట్లే. ఆర్థిక లావాదేవీలు గమినిస్తూ ఖాతాలను ఖాళీ చేస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Telangana Police
Cyber crime
Online Fraud
Screen Sharing Scam
WhatsApp
Bank Fraud
Digital Safety
Cybersecurity
Online Scams
Financial Security
Scroll for the next article