News11th Sep 02:02 PMSunil Byrisetty1 min read

ఫ్యూచర్ సిటీ– అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి ఏపీతో కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 211 కి.మీ పొడవునా, బందర్ పో

ఫ్యూచర్ సిటీ– అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి ఏపీతో కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 211 కి.మీ పొడవునా, బందర్ పోర్టు వరకు 297 కి.మీ దూరంలో 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా అమరావతిని చేరుకునేలా ఈ రహదారి నిర్మించనున్నారు. అమరావతి నుంచి బందర్ పోర్టు వరకు సరుకు రవాణాకు కూడా ఈ మార్గం కీలకంగా ఉపయోగపడనుంది.
Telangana
Future City
Hyderabad
Amaravati
Greenfield Expressway
Infrastructure
Road Connectivity
Rangareddy
Nalgonda
Suryapet
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే
డెవలప్‌మెంట్
అర్బన్ ప్లానింగ్
Scroll for the next article