Automobiles10th Nov 02:23 PMSunil Byrisetty1 min read
కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 125R.. సూపర్ ఫీచర్లు
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 'ఎక్స్‌ట్రీమ్ 125R'లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS) వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మోడల్ ధరన
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 'ఎక్స్‌ట్రీమ్ 125R'లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS) వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మోడల్ ధరను రూ. 1.04 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. కొత్త వేరియంట్‌లో రైడ్-బై-వైర్ థ్రోటిల్, క్రూయిజ్ కంట్రోల్, మూడు రైడింగ్ మోడ్‌లు (ఎకో, రోడ్, పవర్), 4.2-అంగుళాల కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అమర్చారు. హ్యాండిల్‌బార్‌పై కుడి వైపున క్రూయిజ్ కంట్రోల్ కోసం ప్రత్యేక స్విచ్, ఎడమ వైపున రైడ్ మోడ్‌లను మార్చుకోవడానికి, మెనూ నావిగేషన్ కోసం బటన్లు ఇచ్చారు. కొత్త ఎడిషన్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లైనప్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. బేస్ ఐబీఎస్ వేరియంట్ ధర రూ. 89,000 కాగా, ఏబీఎస్, సింగిల్ సీట్ ఏబీఎస్ వేరియంట్ల ధర రూ. 92,500గా ఉంది. తాజాగా విడుదలైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ టాప్ వేరియంట్ ధర రూ. 1.04 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.