Health3rd Sep 04:51 PMSunil Byrisetty1 min read

కిడ్నీ బాధితుల జీవితాల్లో కొత్త ఆశలు

మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్) బారినపడిన ప్రజలతో మరో ఉద్దానాన్ని తలపించే ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా, ఎ.కొండూరు మండలం. ఈ మండల పరిధిలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు, 38 ఆవాసాలు

కిడ్నీ బాధితుల జీవితాల్లో కొత్త ఆశలు
మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్) బారినపడిన ప్రజలతో మరో ఉద్దానాన్ని తలపించే ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా, ఎ.కొండూరు మండలం. ఈ మండల పరిధిలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు, 38 ఆవాసాలు ఉండగా, దాదాపు అన్ని గ్రామాలు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో గిరిజనులు మాత్రమే నివసించే 15 తండాలున్నాయి. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క, ప్రమాదమని తెలిసినా కలుషిత జలాలతో గొంతు తడుపుకునే పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎ.కొండూరుకు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను కిడ్నీ వ్యాధి బారి నుంచి కాపాడాలని సంకల్పించారు. అధికారం చేపట్టిన 26 నెలల్లోనే తన పరిధిలోని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ద్వారా జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధారల నిధులతో ఎ.కొండూరు తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేశారు. రూ. 49.94 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 100 శాతం పనులు పూర్తి చేసుకుని ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలను తీర్చింది.
Andhra Pradesh
A Konduru
NTR District
Kidney Disease
Chronic Kidney Disease
CKD
Kidney Patients
Pawan Kalyan
Deputy Chief Minister
Safe Drinking Water
Drinking Water Project
గిరిజన గ్రామాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఎన్టీఆర్ జిల్లా వార్తలు
ఏపీ ప్రభుత్వం
తాగునీటి ప్రాజెక్టు
Scroll for the next article