News7th May 03:03 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉద్యోగం ఇవ్వడం కాదు.. ఉద్యోగాలిచ్చే స్థాయికి రాష్ట్ర యువత ఎదగాలనే ముఖ్యమంత్రి ఆలోచనలను సాకారం చేస్తామన్

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉద్యోగం ఇవ్వడం కాదు.. ఉద్యోగాలిచ్చే స్థాయికి రాష్ట్ర యువత ఎదగాలనే ముఖ్యమంత్రి ఆలోచనలను సాకారం చేస్తామన్నారు. పామర్రులో రూ.11.26కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన MSME పార్కు నిర్మాణానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. పామర్రులో MSME పార్కు ఏర్పాటు కోసం శ్రమించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు అభినందనలు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కుటుంబ ఆదాయం పెంచేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గతంలో సీఎం చంద్రబాబు చొరవతో ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉదయించారన్నారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు.
Andhra Pradesh
Pamarru
MSME Park
Vasamsetti Subhash
Kollu Ravindra
Machilipatnam
పామర్రులో MSME పార్కు
మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన
Scroll for the next article