News7th Jul 03:49 PMSunil Byrisetty1 min read
3 అంతస్తుల్లో పార్కింగ్.. మల్లీ లెవల్ బిల్డింగ్!
యనమలకుదురు శివాలయం వద్ద నిర్మిస్తున్న మూడంతస్తుల పార్కింగ్ సముదాయం పార్కింగ్ కష్టాలను తీర్చనుంది. విజయవాడ శివారులో తొలి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్ధమైంది. యనమలకుదురులో దేవాదాయ
యనమలకుదురు శివాలయం వద్ద నిర్మిస్తున్న మూడంతస్తుల పార్కింగ్ సముదాయం పార్కింగ్ కష్టాలను తీర్చనుంది.
విజయవాడ శివారులో తొలి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్ధమైంది. యనమలకుదురులో దేవాదాయ శాఖకు చెందిన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దాత సహకారంతో ఈ అధునాతన సముదాయం నిర్మించారు. ఒకేసారి 500 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలు నిలిపేలా ఎకరా స్థలంలో రూ.30 కోట్లతో 3 అంతస్తుల్లో కట్టారు. యనమలకుదురు మునిగిరి కొండపై వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతోంది. వచ్చే 5 దశాబ్దాల పార్కింగ్ అవసరాలకు తగ్గట్టుగా మల్టీ లెవెల్ భవనం నిర్మించారు. కింది అంతస్తులో కార్లు, ఒకటో అంతస్తులో ద్విచక్ర వాహనాలను నిలిపేందుకు సౌకర్యాలు కల్పించారు.