News25th Oct 01:21 PMSunil Byrisetty1 min read

ఆస్ట్రేలియా పర్యటనతో కొత్త భాగస్వామ్యాలు

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ 7 రోజులుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనతో.. ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరిందని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా

ఆస్ట్రేలియా పర్యటనతో కొత్త భాగస్వామ్యాలు
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ 7 రోజులుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనతో.. ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరిందని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. నాలుగు నగరాల పర్యటనలో విశ్వవిద్యాలయాల సందర్శన, పారిశ్రామికవేత్తలతో భేటీలు జరిగాయని తెలిపారు. క్రీడలను శక్తిమంతమైన రంగంగా అభివృద్ధి చేసే అవకాశాలు విస్తారంగా ఉన్నాయన్నారు. భారతదేశం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతోందని చెప్పారు. ఈ సమయంలో, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శక్తి బలోపేతం కావడం కీలకమని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలాలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనకరమైన భాగస్వామ్యాలుగా మారతాయని లోకేశ్‌ ఆకాంక్షించారు.
Andhra Pradesh Development
Nara Lokesh
Australia Visit
International Partnerships
Economic Growth
Skill Development
విశ్వవిద్యాలయాల సందర్శన
పారిశ్రామికవేత్తల భేటీలు
క్రీడా అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి
Scroll for the next article