News23rd Mar 11:59 AMSunil Byrisetty1 min read
పింఛన్ అప్డేట్.. మే నుంచే కొత్త పింఛన్లు
రాష్ట్రంలో అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్త పింఛన్లపై సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో
రాష్ట్రంలో అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కొత్త పింఛన్లపై సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.
అయితే, 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు అందజేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా గుర్తించినట్టు వివరించారు. వారందరికీ మే నెల నుంచి పింఛన్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.