News22nd Apr 02:54 PMSunil Byrisetty1 min read
జులైలో కొత్త పింఛన్లు
కొత్త పింఛన్లు వచ్చేస్తు్న్నాయి. ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త పింఛ
కొత్త పింఛన్లు వచ్చేస్తు్న్నాయి.
ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశం కానుంది.
ఈ సమావేశంలో కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా.
ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.2,722 కోట్లు వెచ్చిస్తున్నారు.
కొత్త పింఛన్లకు నెలకు రూ.250 కోట్ల అదనపు భారం పడనుందని అంచనాలు ఉన్నాయి.
అయినప్పటికీ అర్హులందరికీ పింఛన్లు అందించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.