Politics19th Aug 10:43 AMSunil Byrisetty1 min read

త్వరలో కొత్త పార్టీ: మాజీ ఎంపీ విజయసాయి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఉండగా.. మరో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నానంటూ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి తిరిగి వైసీ

త్వరలో కొత్త పార్టీ: మాజీ ఎంపీ విజయసాయి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఉండగా.. మరో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నానంటూ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి తిరిగి వైసీపీలో చేరబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అలాగే ఆయన పొలిటికల్ రీ ఎంట్రీపై కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్టు తెలిపారు. ‘‘ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల పక్షంగా, ప్రజల గొంతుకను వినిపించేందుకు... ప్రజా వాణికి పార్లమెంట్‌కు, అసెంబ్లీకి తీసుకెళ్లేందుకు... మంచి ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీని పెడతాను. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాను. ఇందుకోసం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రార్థించాను. ఈ నెలలోనే రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తాన’’ని వెల్లడించారు.
Andhra Pradesh Politics
Vijayasai Reddy
New Political Party
YSRCP
Political Re-Entry
Tirumala
రాజకీయ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎంపీ
ప్రాంతీయ రాజకీయాలు
రాజకీయ పరిణామాలు
Scroll for the next article