News13th Aug 05:47 PMSunil Byrisetty1 min read

ఒంగోలు–గుంటూరు సెక్షన్లో నూతన రైల్వే లైన్లు

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు – గుంటూరు సెక్షన్లో మంజూరైన నిర్మాణంలోని రైల్వే ప్రాజెక్టులు, ఒంగోలు నుంచి పక్క జిల్లాలలో నూతన, అనుసంధాన రైల్వే లైన్లపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్

ఒంగోలు–గుంటూరు సెక్షన్లో నూతన రైల్వే లైన్లు
ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు – గుంటూరు సెక్షన్లో మంజూరైన నిర్మాణంలోని రైల్వే ప్రాజెక్టులు, ఒంగోలు నుంచి పక్క జిల్లాలలో నూతన, అనుసంధాన రైల్వే లైన్లపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంటులో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ ఒంగోలు – విజయవాడ – గూడూరు అనుసంధానాన్ని పెంచుటకు 287 కి.మీ. 3 వ లైన్ నిర్మించబడుతోందని చెప్పారు. ఒంగోలు – గుంటూరు పట్టణాలు తెనాలి జంక్షన్ తో ఇప్పటికే అనుసంధానించబడిందని తెలిపారు. ఈ సెక్షన్ లో ఒంగోలు – దొనకొండ 87 కి.మీ. నూతన రైల్వే లైన్ నిర్మాణానికి తుది సర్వే మంజూరయినదని వివరించారు. బలార్షా – తెనాలి – ఒంగోలు – గుంటూరు 782 కి. మీ. 4 లైన్ కు ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయబడిందని, నడికుడి – శ్రీకాళహస్తి 309 కి.మీ. నూతన రైల్వే లైన్ నిర్మాణం మొత్తం ఖర్చు రూ.3,407 కోట్లకు గాను, రూ.2,384 కోట్లు ఖర్చు చేయబడిందని, పిడుగురాళ్ళ – శావల్యాపురం 46 కి. మీ., గుండ్లకమ్మ – కనిగిరి 79 కి.మీ. ప్రాజెక్ట్స్ రిపోర్టులు ప్రారంబించబడ్డాయని తెలిపారు. వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టు తయారయిన తర్వాత, సంబంధిత భాగస్వాములను సంప్రదించి రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేస్తామని తెలిపారు.
Andhra Pradesh
Indian Railways
Ashwini Vaishnaw
Ongole
Guntur
Railway Projects
New Railway Lines
Railway Connectivity
ఒంగోలు–దొనకొండ రైల్వే లైన్
నడికుడి–శ్రీకాళహస్తి
రైల్వే మౌలిక వసతులు
Scroll for the next article