National25th Jul 05:21 PMSunil Byrisetty1 min read

రాజ్యసభ నూతన సభ్యుల అవగాహన సదస్సు

నూతనంగా ఎన్నికైన మరియు నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుల కోసం నిర్వహించిన రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పారిశ్రామిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు

రాజ్యసభ నూతన సభ్యుల అవగాహన సదస్సు
నూతనంగా ఎన్నికైన మరియు నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుల కోసం నిర్వహించిన రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పారిశ్రామిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంపీ చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభను సంపూర్ణ డిజిటల్ సంసద్‌గా మార్చడంలో భాగంగా భాషా పరిమితులను అధిగమించే ‘వాణి సేతు’ నుండి సభ్యుల చేతిలోనే సభా వ్యవహారాలు అందుబాటులో ఉండే ‘సదస్య సేతు’ వరకు సరికొత్త సాంకేతిక మార్పులను ప్రదర్శించారు. నూతన సభ్యులు పార్టీలకతీతంగా దేశ సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, పరిశోధనాత్మక విధానాలు మరియు డిజిటల్ పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ సభా సమయాన్ని ఫలవంతం చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. చట్టసభల నియమాలు, సాంప్రదాయాలు, సభా వ్యవహారాలను నూతన సభ్యులకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఈ ఓరియంటేషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సభ్యులందరికీ సచివాలయం తరఫున సమర్థవంతమైన సేవలు అందిస్తామన్నారు.
India politics
Rajya Sabha
Chintakayala Vijay
Parliament of India
Orientation Programme
Vice President
CP Radhakrishnan
డిజిటల్ పార్లమెంట్
వాణి సేతు
సభ్య సేతు
ఎంపీలు
పార్లమెంటరీ వ్యవహారాలు
Scroll for the next article