News7th May 04:20 PMSunil Byrisetty1 min read

కొత్త రైస్ కార్డుల నమోదు రేపటి నుంచే..!

రాష్ట్రంలో కొత్త రైస్ కార్డుల దరఖాస్తు, ఇతర సేవలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఆరు రకాల సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనో

కొత్త రైస్ కార్డుల నమోదు రేపటి నుంచే..!
రాష్ట్రంలో కొత్త రైస్ కార్డుల దరఖాస్తు, ఇతర సేవలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఆరు రకాల సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1. నూతన రైస్ కార్డుల జారీ 2. కార్డుల విభజన 3. చిరునామా మార్పు 4. సభ్యులను చేర్చడం 5. ఉన్నవారిని తొలగించడం 6. కార్డులను సరెండర్ చేయడం వంటి సేవలను దగ్గర్లోని గ్రామ వార్డు సచివాలయాల నుంచి పొందవచ్చని సూచించారు. వారం తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు రూపంలో జూన్ నెలలో జారీ చేస్తామని మంత్రి మనోహర్ చెప్పారు.
Andhra Pradesh
New Ration Card Application
Smart Rice Cards
మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో కొత్త రైస్ కార్డుల దరఖాస్తు
ఆరు రకాల సేవలు
Scroll for the next article