News29th Jul 05:28 PMSunil Byrisetty1 min read

డెబిట్ కార్డ్ సైజులో స్మార్ట్ రైస్ కార్డులు!

రాష్ట్రంలో కొత్త రైస్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల ఫొటోస్ లేకుండా కార్డులను డిజైన్ చేశామని తెలిపారు. కొత్త

డెబిట్ కార్డ్ సైజులో స్మార్ట్ రైస్ కార్డులు!
రాష్ట్రంలో కొత్త రైస్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల ఫొటోస్ లేకుండా కార్డులను డిజైన్ చేశామని తెలిపారు. కొత్త కార్డులు డెబిట్ కార్డ్ సైజులో ఇవ్వబోతున్నామని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ సహాయంతో ఈ కార్డులు ఉంటాయన్నారు. ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. కేంద్రం 60 శాతం రైస్ కార్డులకు సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు కోసం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని.. కొత్తగా 9 లక్షల మందికి పైగా కొత్త కార్డులు వచ్చాయన్నారు. ఆగస్ట్ 25 నుంచి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.
Andhra Pradesh news
Smart Ration Cards
Rice Card Distribution
QR code Enabled Cards
Public Distribution System
Minister Nadendla Manohar
రేషన్‌కార్డులు
పౌరసరఫరాలశాఖ
ఉచితస్మార్ట్కార్డులు
Scroll for the next article