News27th Mar 12:16 PMSunil Byrisetty1 min read

రిజిస్ట్రేషన్లకు నిరీక్షణకు చెల్లు

ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే సుదీర్ఘ సమయం వెచ్చించాల

రిజిస్ట్రేషన్లకు నిరీక్షణకు చెల్లు
ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే సుదీర్ఘ సమయం వెచ్చించాల్సి వచ్చేది. ఇక ఆ కష్టాలకు చెల్లు చెబుతూ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా ముందుస్తుగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనుంది. స్లాట్‌లో వీలును బట్టి సమయం పేర్కొని, కేటాయించిన సమయం ప్రకారం వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. మొన్నటి వరకు భూముల రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వెయిటింగ్‌ చేయకుండా రిజిస్ట్రేషన్ సమయానికి వెళ్తే సరిపోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది.
AP Land registration
CM Chandrababu
Slot Booking
Scroll for the next article