Spiritual29th Aug 11:53 AMSunil Byrisetty1 min read
దుర్గ గుడిలో కొత్త నిబంధనలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అధికారులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లో రావాలని లేకపోతే వారికి దర్శనానికి
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అధికారులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లో రావాలని లేకపోతే వారికి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలో సెల్ఫోన్ను కూడా నిషేధించారు. ఆలయ సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిబంధనలు తీసుకువచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇక నుంచి నిబంధనలు కచ్చితంగా అమలు చేయనున్నారు.