News10th Aug 04:27 PMSunil Byrisetty1 min read
'తల్లీబిడ్డ"ఎక్స్ ప్రెస్ వాహనాల్లో భద్రతా సదుపాయాలు
తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణానికి ‘102 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల సేవలకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. దేశంలోనే తొలిసారిగా తల్లీ బిడ్డల భద్రత, ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో
తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణానికి ‘102 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల సేవలకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. దేశంలోనే తొలిసారిగా తల్లీ బిడ్డల భద్రత, ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని అత్యాధునిక వాహనాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. తల్లులు, నవజాత శిశువులు సులభంగా ఎక్కడం, దిగడం, ప్రయాణంలో భద్రత, అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు రూపొందిస్తున్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువులకు ఎదురయ్యే రవాణా సమస్యను తొలగించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, అధిక ప్రమాద (హైరిస్క్) గర్భిణులకు అవసరమైన సమయంలో రవాణా అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యం. కొత్త వాహనాల ప్రారంభ కార్యక్రమం ఆగస్టు 11న నరసరావుపేటలో జరగనుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన వాహన సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమా నికి అనుగుణంగా జిల్లాల్లోనూ కొత్త వాహనాల సేవలు ప్రారoభం కానున్నాయి.