News4th Dec 04:04 PMSunil Byrisetty1 min read

ఏడాదిలో సరికొత్త టోల్‌ వ్యవస్థ

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టోల్ వ్యవస్థపై అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుత టోల్‌ వసూలు వ్యవస్థ ఏడాది లోపే కనుమరుగు అవుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అ

ఏడాదిలో సరికొత్త టోల్‌ వ్యవస్థ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టోల్ వ్యవస్థపై అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుత టోల్‌ వసూలు వ్యవస్థ ఏడాది లోపే కనుమరుగు అవుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఇప్పటికే 10 చోట్ల ప్రవేశపెట్టిన సరికొత్త వ్యవస్థను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు లోక్‌సభకు వెల్లడించారు. ఈ కొత్త విధానంలో ఉపగ్రహాల సాయంతో టోల్‌ విధించనున్నారు. వాహనాలు టోల్‌ గేట్ల వద్ద ఆగనవసరం లేకుండా ఆటోమేటిగ్గా రుసుము చెల్లిస్తూ వేగంగా కదలిపోవడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయి. తద్వారా టోల్ గేట్ల వద్ద రద్దీని నియంత్రించడంతోపాటు, పారదర్శకత పెంపొందించవచ్చు.
India Roads
New Toll Policy
Nitin Gadkari
Toll System
Satellite Tolling
National Highways
Central Government
Parliament Update
Road Transport
Automatic Toll Collection
Highway Technology
Scroll for the next article