Farmers11th Oct 03:14 PMSunil Byrisetty1 min read

రైతు సాధికార‌త ల‌క్ష్యంగా స‌రికొత్త ప‌థ‌కాలు

రైతుల క్షేమం, సంక్షేమం ల‌క్ష్యంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నాయ‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డం ద్వారా సాధికార‌త సాధించ‌వ

రైతు సాధికార‌త ల‌క్ష్యంగా స‌రికొత్త ప‌థ‌కాలు
రైతుల క్షేమం, సంక్షేమం ల‌క్ష్యంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నాయ‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డం ద్వారా సాధికార‌త సాధించ‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శ‌నివారం గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రూ. 24 వేల కోట్ల‌తో ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) ప‌థ‌కంతో పాటు రూ. 11,440 కోట్ల‌తో ప‌ప్పు ధాన్యాల్లో ఆత్మ‌నిర్భ‌ర‌తా మిష‌న్‌ను ప్రారంభించారు. అదేవిధంగా వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేయ‌డంతో పాటు మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వ‌ర్చువ‌ల్‌గా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల్లో స్వ‌యంస‌మృద్ధి, సుస్థిర ప్ర‌గ‌తి ల‌క్ష్యంగా ప్ర‌భుత్వాలు వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తున్నాయ‌ని.. వీటిపై అవ‌గాహ‌న పెంపొందించుకొని స‌ద్వినియోగం చేసుకోవ‌డం ద్వారా సాగును లాభసాటిగా మార్చుకొని, ఆర్థికంగా ఎదగొచ్చ‌ని పేర్కొన్నారు. జిల్లాలో రైతుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా కూడా ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు.
Farmer Welfare
Agriculture
PM Modi
PM Dhan Dhanya Yojana
Self Reliance Mission
Sustainable Farming
Agriculture Development
Farmer Empowerment
Agri Schemes
Rural Development
Scroll for the next article