News7th Oct 10:21 AMSunil Byrisetty1 min read
మారిన డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సర్వీస్ రూల్స్
ఏపీలో డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సంబంధించి కీలకమైన సర్వీస్ రూల్స్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టును కేటగిరీ–4గా చేర్చారు. స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్, డ
ఏపీలో డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సంబంధించి కీలకమైన సర్వీస్ రూల్స్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టును కేటగిరీ–4గా చేర్చారు. స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ (రిసర్వే) పోస్టులు కూడా ఇందులోకి వస్తాయి. డిప్యూటీ తహసీల్దార్ నియామకాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ ద్వారా చేపడతారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికయ్యే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి
నోటిఫికేషన్ వెలువడే సంవత్సరం జూలై 1 నాటికి 34 సంవత్సరాలు పూర్తి అయి ఉండకూడదు. సీనియర్ అసిస్టెంట్ నుంచి నియామకానికి: కనీసం 4 సంవత్సరాల సర్వీస్ అవసరం. అందులో 2 సంవత్సరాలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.