National4th Oct 10:14 AMSunil Byrisetty1 min read
ఫాస్టాగ్ లేదా.. ఇలా చేయొచ్చు
టోల్ గేట్లను దాటే సమయంలో వాహనాలు చెల్లించాల్సిన టోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం రెండు కొత్త నిబంధనలను ప్రవేశపెట్
టోల్ గేట్లను దాటే సమయంలో వాహనాలు చెల్లించాల్సిన టోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం రెండు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఇప్పటి వరకు సాధారణ రుసుముకు రెండింతల మొత్తం చెల్లించాల్సి వచ్చేది. ఈ నిబంధనను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇలాంటి వాహనదారులు నగదు రూపంలో అయితే ఇప్పటి మాదిరిగా రెండు రెట్లు చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త నిబంధనలు నవంబరు 15 నుంచి అమలోకి వస్తాయి.