Education17th Mar 10:16 AMSunil Byrisetty1 min read

ఏడు పరీక్షలకు ఏడు డ్రస్ లా ?

పరీక్షల కోసం నయా ట్రెండ్ వచ్చేసింది. నేను ఫస్ట్ టైం విన్నాను. ఇది తల్లిదండ్రులు నయా ట్రెండ్ అనుకుంటా. టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. సరదాగా మిత్రుల మాటల్లో విని ఆశ్చర్యపోయాను. టెన్

ఏడు పరీక్షలకు ఏడు డ్రస్ లా ?
పరీక్షల కోసం నయా ట్రెండ్ వచ్చేసింది. నేను ఫస్ట్ టైం విన్నాను. ఇది తల్లిదండ్రులు నయా ట్రెండ్ అనుకుంటా. టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. సరదాగా మిత్రుల మాటల్లో విని ఆశ్చర్యపోయాను. టెన్త్ పరీక్షలు రాసే పిల్లలు ఏడు పరీక్షలకు ఏడు డ్రెస్ లు కావాలి అంటుంటే తల్లిదండ్రులు కొంటున్నారంట. ఎటు పోతున్నామో అర్ధం కావడం లేదు.పదేళ్లు ముందుకు వెళ్ళితే ఇలాంటి ట్రెండ్ లేదు. పరీక్షలు అంటే ఒక జత మగపిల్లలు అయితే లాగు,చొక్కా,ఆడపిల్ల అయితే లంగా జాకెట్టు ఉండేవి. ఏమిటో రోజులు మారాయి.తల స్నానం కూడా పరీక్షలు తరువాతే ఎందుకంటే తలస్నానం చేస్తే చదివింది పోతుందని చేయనిచ్చేవారు కాదు. ఏడు పరీక్షలు ఏడు డ్రెస్ లు, అదే 13 పరీక్షల విధానం ఉంటే 13 పరీక్షల కు 13 డ్రెస్ లు కొనడం సాధ్యమేనా.ఏమో ఇప్పటి తల్లిదండ్రులు కొనేవారేమో. రోజులు మారాయి ఇది పిల్లల రోజులు. వాళ్ళు ఏమి చెబితే దానికి తల్లిదండ్రులు తల ఆడించాలి. కొత్త డ్రెస్ కొనకపోతే పరీక్ష బాగా రాయరు అని తల్లిదండ్రులు బావిస్తున్నారేమో అందుకే ఏడు పరీక్షల కు ఏడు కొత్త డ్రెస్ లు వారెవ్వా... ఏం ట్రెండ్ రా బాబు.
SSC Exams
టెన్త్ పరీక్షలు
Scroll for the next article