Crime30th May 11:31 AMSunil Byrisetty1 min read
నకిలీ యాప్‌లతో వల.. దోచేస్తున్నారు!
ప్రతి ఒక్కరి ఫోన్లో లెక్కకు మించిన యాప్‌లు ఉంటున్నాయి. లావాదేవీల కోసం సైతం పలు యూపీఐ యాప్‌లు, లోన్ల కోసం అనేక యాప్‌లు ఉపయోగిస్తున్నారు. నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులకు ఇవి అవసరమవు
ప్రతి ఒక్కరి ఫోన్లో లెక్కకు మించిన యాప్‌లు ఉంటున్నాయి. లావాదేవీల కోసం సైతం పలు యూపీఐ యాప్‌లు, లోన్ల కోసం అనేక యాప్‌లు ఉపయోగిస్తున్నారు. నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులకు ఇవి అవసరమవుతున్నాయి. ఇదే అదనుగా వినియోగదారుల ఖాతాలను ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు వలపన్నుతున్నారు. నకిలీ బ్యాంకింగ్ యాప్లతో ఎర వేస్తున్నారు. అవే అసలువని డౌన్లోడ్ చేసుకుని దోపిడీకి గురవుతున్నారు. విజయవాడకు చెందిన గృహిణికి ఇటీవల ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. కొత్త ఫీచర్లతో మొబైల్ బ్యాంకింగ్ యాప్ అప్డేట్ చేశామని, దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పడంతో, వాడుతున్న అన్ఇన్స్టాల్ చేసింది. మెసేజ్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంది. ఆ వెంటనే తన ఖాతా నుంచి రూ.2 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించి భోరుమంది. అలాగే ఓ ప్రైవేటు ఉద్యోగి ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసి లాగిన్ అయిన అరగంటలోనే ఖాతాలోని రూ.8.40లక్షలు డెబిట్ అయ్యాయి. బ్యాంక్ యాప్ తరహాలోనే రూపొందిన నకిలీ యాప్‌లను నమ్మితే మోసపోవాల్సిందే కాబట్టి యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ విభాగాలు సూచిస్తున్నాయి.