Crime21st Dec 04:45 PMSunil Byrisetty1 min read
వాట్సాప్ లో నయా స్కామ్.. ఘోస్ట్ పేయిరింగ్
వాట్సాప్ వినియోగదారులకు వరుసగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా?” అంటూ ఏదైనా సందేశం వ
వాట్సాప్ వినియోగదారులకు వరుసగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా?” అంటూ ఏదైనా సందేశం వస్తే అది ఎవరినుంచి వచ్చినా క్లిక్ చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా మనకు తెలిసిన వారి పేరు, DP కనిపిస్తే నమ్మేసే మనస్తత్వాన్ని దొంగలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ తరహా లింకులు “ఘోస్ట్ పేయిరింగ్” స్కామ్ భాగమని సజ్జనార్ వివరించారు.
లింక్‌ను ఓపెన్ చేస్తే నకిలీ WhatsApp Web లాగిన్ పేజీ తెరుచుకుంటుంది. అక్కడ వివరాలు ఎంటర్ చేస్తే అకౌంట్ హ్యాకర్లు చేతుల్లో పడిపోతుంది. తర్వాత ఆ హ్యాకర్లు యూజర్ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపిస్తూ డబ్బు దోచుకునే మోసాలకు పాల్పడతారు.