News1st Jan 03:53 PMSunil Byrisetty1 min read
శరణాలయంలో నూతన సంవత్సర వేడుకలు
పిల్లలకు ఇష్టమైన వేడుకలలో నూతన సంవత్సర వేడుకలు ఒకటి. అయితే శరణాలయంలోని బాలబాలికలకు ఆ లోటు ఉండకూడదని ఓ అడ్వకేట్ నూతన సంవత్సర వేడుకలను వారి మధ్య జరిపి ఆనందోత్సవాలను నింపారు. చినకాకాన
పిల్లలకు ఇష్టమైన వేడుకలలో నూతన సంవత్సర వేడుకలు ఒకటి. అయితే శరణాలయంలోని బాలబాలికలకు ఆ లోటు ఉండకూడదని ఓ అడ్వకేట్ నూతన సంవత్సర వేడుకలను వారి మధ్య జరిపి ఆనందోత్సవాలను నింపారు.
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా 2026 నూతన సంవత్సర కేక్ ను అడ్వకేట్ సుంకర, ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఐ తాటి కృష్ణారావు నాయుడు కట్ చేశారు. బాల బాలికలకు కేక్, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం కృష్ణారావు మాట్లాడారు. పిల్లలకు ఇష్టమైన నూతన సంవత్సర వేడుకలను అడ్వకేట్ చరణ్ శరణాలయం బాల బాలికల మధ్య జరపటం అభినందనీయమన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలో వేడుకలను జరుపుకోలేకపోయామనే నిరాశ ఈ వేడుకల వలన దూరమవుతుందన్నారు. తమ వృత్తిని కొనసాగించుకుంటూ సమాజానికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేస్తున్న చరణ్ ను ఆయన అభినందించారు.