News1st Jan 03:23 PMSunil Byrisetty1 min read

చురుక్కుమననున్న సిగరెట్.. ధరల షాక్!

సిగరెట్ కాల్చకుండానే నోరు చేదెక్కనుంది. న్యూ ఇయర్ వేళ సిగరెట్ ప్రియులకు షాక్ కొట్టే వార్త వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. సిగరెట్, బీడీ, పాన్ మసా

చురుక్కుమననున్న సిగరెట్.. ధరల షాక్!
సిగరెట్ కాల్చకుండానే నోరు చేదెక్కనుంది. న్యూ ఇయర్ వేళ సిగరెట్ ప్రియులకు షాక్ కొట్టే వార్త వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. సిగరెట్, బీడీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా పన్ను నిర్ణయాల వల్ల ఈ ఉత్పత్తులపై వినియోగదారులకు అదనపు భారం పడనుంది. పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించనుండగా, బీడీలపై 18 శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది.
Cigarettes
Bidi
Pan Masala
Price Hike
Tobacco Products
Central Government
New Taxes
GST
Consumers
Tobacco News
Scroll for the next article