Mobiles31st Dec 03:55 PMSunil Byrisetty1 min read
కొత్త ఏడాది.. స్మార్ట్‌గా స్టార్ట్
నూతన సంవత్సర కానుకగా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త మోడల్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. జనవరిలో పలు మొబైల్స్ లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. చైనా కంపెనీ షావోమి తన రెడ
నూతన సంవత్సర కానుకగా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త మోడల్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. జనవరిలో పలు మొబైల్స్ లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
చైనా కంపెనీ షావోమి తన రెడ్‌మి నోట్ సిరీస్‌ను మార్కెట్లోకి తిరిగి తీసుకువస్తోంది. జనవరి 6న Redmi Note 15 లాంచ్ అవుతుంది. ఇందులో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే వస్తుంది. దీనిని Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 108MP మెయిన్ కెమెరాతో ప్రారంభ ధర సుమారు రూ. 25 వేలు ఉండవచ్చు.
OPPO Reno 15 సిరీస్ జనవరి 8న భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇందులో Oppo Reno 15, రెనో 15 ప్రో (Reno 15 Pro), Reno 15 Pro Mini తో సహా 3 మోడల్స్ ఉండవచ్చు. ఈ సిరీస్ ప్రారంభ ధర 40,000 రూపాయల వరకు ఉండవచ్చు.
వివో X300 FE ఫోన్ జనవరి చివరి నాటికి లాంచ్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇందులో 6.31 అంగుళాల OLED LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఇది Android 16 పై రన్ అవుతుంది. వెనుకవైపు 50MP + 8MP + 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, సెల్ఫీలు, సెల్ఫీ వీడియోల కోసం ముందువైపు కూడా 50MP లెన్స్ ఉంటుంది.
Vivo V70 ఫోన్ జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 6.5 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్, 12GB+256GB వేరియంట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ. 45 వేల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.