Education17th Sep 11:06 AMSunil Byrisetty1 min read

25 నుంచి కొత్త జడ్పీ కార్యాలయాలు

ఏపీలో కొత్త జడ్పీ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. ఈ నెల 25 నుంచి జిల్లా పరిషత్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. 24తో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం వెంటనే 15 కొత్త జిల్లాల్లోనూ జిల

25 నుంచి కొత్త జడ్పీ కార్యాలయాలు
ఏపీలో కొత్త జడ్పీ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. ఈ నెల 25 నుంచి జిల్లా పరిషత్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. 24తో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం వెంటనే 15 కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జడ్పీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా భవనాలు సమకూర్చడం, సిబ్బంది విభజన తదితర ఏర్పాట్ల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల్లోనూ జడ్పీల ఏర్పాటుకు ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్తగా 15 జడ్పీ సీఈవో, మరో 15 డిప్యూటీ సీఈవోల పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయడంతో అర్హులైన అధికారులకు పదోన్నతులు కల్పించనున్నారు. పాత జిల్లా పరిషత్ కార్యాలయాల్లో సిబ్బందిని విభజించి కొత్త జిల్లాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
Andhra Pradesh
AP News
Zilla Parishad
ZP Offices
New Districts
AP Government
District Administration
ఏపీ ప్రభుత్వం
జిల్లా పరిపాలన
జడ్పీ సీఈవో
డిప్యూటీ సీఈవో
Scroll for the next article