Telangana23rd Jun 12:05 PMSunil Byrisetty1 min read
గద్వాలలో సుపారి హత్య?
దేశాన్ని కుదిపేసిన 'మేఘాలయ హనీమూన్ మర్డర్' తరహా ఘటన తెలంగాణలోని గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి.. నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పె
దేశాన్ని కుదిపేసిన 'మేఘాలయ హనీమూన్ మర్డర్' తరహా ఘటన తెలంగాణలోని గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి.. నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకు ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా.. ఐదురోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన నవవరుడు.. ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్(32)కు, ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు మే 18న వివాహం జరిగింది. పెళ్లయిన రెండో రోజు నుంచే భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా.. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఐదు రోజులకు, ఏపీలోని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్ట జమ్ములో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది. విచారణలో పెళ్లికి ముందు వివాహేతర సంబంధం వల్లే సుపారి హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.