News17th Sep 03:43 PMSunil Byrisetty1 min read
సీఎస్ ను కలిసిన ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలు
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు సయాని విజయ భారతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ను విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాట
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు సయాని విజయ భారతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ను విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్టు తదితర అంశాలపై సీఎస్‌తో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు.. భవిష్యత్తులో వారి కోసం తీసుకునే చర్యలు తదితర అంశాలపై ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, ఇదే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా అందించాలని సీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ ( న్యాయ విభాగం) ఇంద్రజిత్ కుమార్, నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వర రావు, పోలవరం ప్రాజెక్ట్ పరిపాలన అధికారి అభిషేక్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. స్మరణ్ రాజ్ పాల్గొన్నారు.