News28th Jun 10:55 AMSunil Byrisetty1 min read
NIAకి విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు
విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసును NIAకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కి చెందిన సమీర్, వరంగల్‌కి చెందిన మొయిద్దీన్‌ను NIA అదుపులోక
విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసును NIAకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కి చెందిన సమీర్, వరంగల్‌కి చెందిన మొయిద్దీన్‌ను NIA అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కేసును తమకు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకుంది.కేసుకు సంబంధించిన వివరాలను NIAకి విజయనగరం టూటౌన్ పోలీసులు అందించనున్నారు. నిందితులపై సెక్షన్ 113, 147,148,149,154ల కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితులు సిరాజ్, సమీర్ ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు.