News17th May 04:08 PMSunil Byrisetty1 min read
నిడదవోలుకు సరికొత్త కళ.. 11 నెలల్లో రూ.105.80 కోట్లు
రాష్ట్రంలో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేసి అందమైన నిడదవోలుకు బాటలు వేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కందు
రాష్ట్రంలో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేసి అందమైన నిడదవోలుకు బాటలు వేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
నిడదవోలు మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
త్వరలోనే నిడదవోలు పట్టణాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 11 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి రూ.15.75 కోట్ల అంచనా వ్యయంతో 240 అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నామన్నారు.
రూ.8.12 కోట్లతో ఇప్పటికే 187 పనులు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు.
మిగిలిన నిధులతో మిగిలిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు