National10th Jul 09:45 AMSunil Byrisetty1 min read
హత్య కేసులో.. యెమెన్‌లో భారతీయురాలికి ఉరి
యెమెన్ దేశంలో హత్య చేసిందన్న కేసులో కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సుకు మరణ శిక్ష అమలు చేయబోతున్నారు. నిమిషా ప్రియకు ఈ నెల 16వ తేదీన యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్ష అమలు చేయనుంది. కే
యెమెన్ దేశంలో హత్య చేసిందన్న కేసులో కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సుకు మరణ శిక్ష అమలు చేయబోతున్నారు. నిమిషా ప్రియకు ఈ నెల 16వ తేదీన యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్ష అమలు చేయనుంది. కేరళకు చెందిన నిమిషాకు క్షమాభిక్ష కోసం ఆమె కుటుంబసభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు తేదీ ఖరారవడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిమిషా ఉరికి సంబంధించి భారత విదేశీ వ్యవహారాల శాఖ యెమెన్ ప్రభుత్వంతో సమీక్షిస్తున్నట్లు సమాచారం. నర్సింగ్ పూర్తి చేసిన నిమిషా ప్రియ యెమెన్ దేశంలో నర్సుగా పని చేసి, తర్వాత సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకుంది. యెమెన్ రూల్స్ ప్రకారం .. ఇతర దేశాల వాళ్లు ఆ దేశంలో బిజినెస్ చేయాలంటే.. స్థానికులను భాగస్వామిగా చేర్చుకోవాలి. అందుకోసం స్థానికుడైన తలాల్ అబ్ద్ మహది అనే వ్యక్తిని భాగస్వామిగా చేర్చుకుంది. కొంత కాలానికే ఇద్దరి మధ్యా గొడవలు కావడంతో అతడి వేధింపులు పెరిగిపోయాయి. అతడి వద్దనున్న తన పాస్ పోర్టుని తీసుకోవడానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా అతడు మరణించాడు. ఈ నేరంలో 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న నిమిషాకు ఉరి శిక్ష ఖరారైంది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ ఆమె ఉరి ఆపడం సాధ్యం కాదని తెలుస్తోంది.