Politics7th Mar 12:47 PMSunil Byrisetty1 min read
చేతికి క్యానులాతో అసెంబ్లీకి నిమ్మల.. ట్రిపుల్ ఆర్ రూలింగ్!
‘డాక్టర్ రామానాయుడు గారు.. మీరు పని రాక్షసుడు.. ప్రజా సేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్’ అని అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఉన్న
‘డాక్టర్ రామానాయుడు గారు.. మీరు పని రాక్షసుడు.. ప్రజా సేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి.
జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు.
ఇది నా రూలింగ్’ అని అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆదేశాలిచ్చారు.
జ్వరంతో ఉండి కూడా నిమ్మల అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండటంతో వద్దని మంత్రి లోకేష్, విష్ణుకుమార్ రాజు తదితరులు వారించారు.
చేతికి క్యానులా తో అసెంబ్లీకి హాజరవడంతో మంత్రి లోకేష్ స్పందించి.. అన్నకు బాగోలేదు అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు.
చెప్పినా వినడం లేదు. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా అనడిగారు. ‘జ్వరం అని నాకు తెలియదు.. రామానాయుడు నాకు చాలా కాలంగా తెలుసు మా ఊరు పక్కవాడే. పట్టుదల మనిషి. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దని రూలింగ్ ఇస్తున్నానని ట్రిపుల్ ఆర్ సరదాగా వ్యాఖ్యానించారు.