News17th Aug 01:12 PMSunil Byrisetty1 min read
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి.!
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోజికోడ్ జిల్లాలోని తొమ్మిదేళ్ల బాలికకు అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ సోకినట్లు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని వైద్యు
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోజికోడ్ జిల్లాలోని తొమ్మిదేళ్ల బాలికకు అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ సోకినట్లు గుర్తించారు.
ఈ ఏడాది జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీటిలో ఉండే అరుదైన "బ్రెయిన్ ఈటింగ్ అమీబా" వల్ల ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. మెదడు వాపు వ్యాధికి అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ వ్యాధి సోకిన తొమ్మిదేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు కోజికోడ్ వైద్య కళాశాలలకు తరలించగా, అదే రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. మైక్రోబయాలజీ పరీక్షల్లో అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ వ్యాధి కారణంగా బాలిక మరణించిందని వైద్యులు స్పష్టంచేశారు.