News10th May 11:27 AMSunil Byrisetty1 min read

భారత్-పాక్ వార్.. బ్యాంకులకు నిర్మల సూచన

భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక సూచనలు చేశారు. ఖాతాదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవ

భారత్-పాక్ వార్.. బ్యాంకులకు నిర్మల సూచన
భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక సూచనలు చేశారు. ఖాతాదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు. సైబర్ భద్రత సన్నద్ధతపై బ్యాంకులు, ఆర్బీఐ, ఎన్పీసీఐ, బీమా సంస్థల ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కార్యాలయాలతో పాటు డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని, యూపీఐ సేవలు సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
India Pakistan War
Banks to Ensure Uninterrupted Services
Nirmala SITHARAMAN
operation sindoor
RBI
బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక సూచనలు
సైబర్ భద్రత సన్నద్ధతపై బ్యాంకులు
Scroll for the next article