News4th Jun 05:30 PMSunil Byrisetty1 min read

చేపలను కాదు.. తిమింగలాలను పట్టుకోవాలి

స్మగ్లింగ్‌లో చిన్న చేపలను కాదు.. తిమింగలాలను పట్టుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నిర్మూలించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. స్

చేపలను కాదు.. తిమింగలాలను పట్టుకోవాలి
స్మగ్లింగ్‌లో చిన్న చేపలను కాదు.. తిమింగలాలను పట్టుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నిర్మూలించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. స్మగ్లింగ్ సిండికేట్‌ల సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని DRI అధికారులను సూచించారు. తక్కువ స్థాయి స్మగ్లింగ్ కార్యకర్తలను పట్టుకోవడంతో సంతృప్తి చెందడానికి బదులుగా, నేరానికి మూలకారణాన్ని కనుగొని కేసును ముగింపునకు తీసుకురావాలని నిర్మలా సీతారామన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్పారు. కేసులను గుర్తించడం మాత్రమే కాదు, మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించడమే లక్ష్యం కావాలన్నారు. ’’చిన్న చేపలను పట్టుకోవడంలో అర్థం లేదు. మన ఫిషింగ్ లైన్ పట్టలేని పెద్ద తిమింగలాలు ఉన్నాయి” అని డిఆర్‌ఐ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి అన్నారు.
India news
Minister Nirmala Sitharaman
Revenue Intelligence
DRI officers
whales
fishing
చేపలను కాదు తిమింగలాలను పట్టుకోవాలి
స్మగ్లింగ్
Scroll for the next article