National15th Sep 10:49 AMSunil Byrisetty1 min read
కొత్త పన్నులతో షాపుల ముందు బోర్డులు పెట్టాలి
కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీని తగ్గించింది. 350కి పైగా వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ తగ
కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీని తగ్గించింది. 350కి పైగా వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా చేరేలా చూడటానికి, ఇకపై ప్రతి దుకాణంలోనూ కొత్త పన్ను రేట్ల వివరాలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ‘వికసిత్ భారత్ దిశగా పన్నుల సంస్కరణలు’ అనే సదస్సులో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా తగ్గిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల అనేక వస్తువుల ధరలు దిగివస్తాయని అన్నారు.