News26th Jun 05:21 PMSunil Byrisetty1 min read

టూవీలర్లపై టోల్.. అవాస్తవం!

ద్విచక్ర వాహనాలకూ టోల్ చార్జీలు చేస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టూ వీలర్లకు టోల్ వసూలు చేస్తారన్న వార్తలు తప్పుడు సమాచారం అని కేంద్ర మంత్రి నితిన్

టూవీలర్లపై టోల్.. అవాస్తవం!
ద్విచక్ర వాహనాలకూ టోల్ చార్జీలు చేస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టూ వీలర్లకు టోల్ వసూలు చేస్తారన్న వార్తలు తప్పుడు సమాచారం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ‘‘ఇలాంటి ఎలాంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వంలో లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలు చేయొద్దు,’’ అని ఆయన సూచించారు. ఇలాంటి తప్పుడు వార్తల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని అన్నారు. ధ్రువీకరించుకోకుండా వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
India Highways
Nitin Gadkari
Two Wheeler Toll
national Highway
Fake News Alert
Toll Free Bikes
Transport Ministry
Scroll for the next article